అధికారిక ప్రకటన వచ్చేసింది

గత కొన్ని రోజులుగా రజనీ కాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. 46 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరు టాప్ హీరోలు మరో సారి కలిసి నటించనున్నారు. ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నది నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సినిమా కు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. కె హెచ్, ఆర్ కె రీ యూనియన్ అంటూ ఈ వీడియో తో పాటు ఒక లుక్ కూడా విడుదల చేశారు. ఇందులో ఇద్దరూ హీరో లు స్టైలిష్ గా లో కనిపించారు.
ఈ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌లో దర్శకుడు నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కూడా ఉంటారు.



