నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం
BY Admin26 Dec 2020 1:16 PM GMT
X
Admin26 Dec 2020 1:16 PM GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం కుదుటపడింది. తాజాగా వచ్చిన పరీక్షల ఫలితాల్లో అసాధారణ అంశాలు ఏమీ డాక్టర్లు గుర్తించలేదు. అయితే మరికొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. దీంతోపాటు శనివారం రాత్రి కూడా రజనీకాంత్ బీపీని పరీక్షించి డిశ్చార్జిపై ఆదివారం నాడు నిర్ణయం తీసుకుంటామని అపోలో ఆస్పత్రి శనివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న రజనీకాంత్ యూనిట్ లో కొంత మందికి కరోనా రావటంతో ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. సడన్ గా హై బీపీ రావటంతో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. చెన్నయ్ నుంచి వచ్చిన రజనీకాంత్ వ్యక్తిగత డాక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
Next Story