రాజమౌళికి పోటీగా ప్రశాంత్ నీల్!
మళ్ళీ అందులోనూ కామెడీ చూపించరు. అక్కడకు హెలికాప్టర్ వచ్చే సమయంలో హీరో యశ్ అక్కడ ఉన్న మహిళలతో అమ్మా అప్పడాలు జాగ్రత్త అని చెబుతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎవరి అంచనాలకు అందనంత ఎత్తుకు చేరిపోయారనే చెప్పాలి. రాజమౌళితో పోలిస్తే ప్రశాంత్ నీల్ తీసిన సినిమాలు చాలా తక్కువే అయినా ఇప్పుడు ఆయన్ను అందరూ రాజమౌళితో పోలుస్తున్నారు. దీంతో ఇప్పుడు రాజమౌళి అయినా..ప్రశాంత్ నీల్ అయినా ఇక ప్రతి అడుగు మరింత జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా రాజమౌళికి తిరుగులేని దర్శకుడు అని పేరుండేది. ఇప్పుడు అది ప్రశాంత్ నీల్ రూపంలో మరో పోటీ ఎదురైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో కలసి సాలార్ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో కూడా కొత్త ప్రాజెక్టు ప్రారంభించే అవకాశం ఉంది. అటు రాజమౌళి, ఇటు ప్రశాంత్ నీల్ లు ఇలా పోటీలు పడి సినిమాలు తీసి సినిమా ప్రేక్షకులను ఆలరిస్తూ ఎవరు ముందు వరసలో నిలుచుంటారో వేచిచూడాల్సిందే.