సాయం కోసం రాజమౌళి ట్వీట్ ..తీవ్రమైన విమర్శలు
ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన ఓ ట్వీట్ దుమారం రేపుతోంది బాహుబలి సినిమా కోసం పనిచేసిన దేవిక ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతుందని..దయచేసి ఆమెకు సాయం చేయండి అంటూ ఆమె గురించి వచ్చిన స్టోరీని రాజమౌళి ట్వీట్ చేశారు. అదే సమయంలో తాను బాహుబలి సమయంలో దేవికతో కలసి పనిచేశానని..ఎన్నో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆమె కో ఆర్డినేటర్ గా వ్యవహరించారని తెలిపారు. పనిపట్ల ఆమె అంకిత భావం ఎనలేనిదని..దురదృష్టవశాత్తు ఆమె ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలిపారు. దయ చేసి ఆమెకు సాయం చేయటానికి మీరూ ముందుకు రండి అని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. అయితే ఆ ట్వీట్ లో ఎక్కడా కూడా ఆమెకు రాజమూళి ఎంత సాయం చేసింది ప్రస్తావించలేదు. అసలు చేశారా లేదా అన్న సంగతి కూడా తెలియదు. దీంతో రాజమౌళి ట్వీట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకునే నువ్వు ఇతరుల సాయం కోరటమా?. మీరు ఆ మాత్రం సాయం కూడా చేయలేరా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అంతే కాదు..కొంత మంది అయితే అభ్యంతరకర భాషలో సైతం రాజమౌళిపై విమర్శలు చేస్తున్నారు.
200 నుంచి 300 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు వసూలు చేసే మీరు సాయం చేయలేక..చివరకు ప్రజలను సాయం అడుగుతారా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మీరే చేయవచ్చు..మీరు..మీ ఆర్టిస్ట్ లు సాయం చేస్తే సరిపోతుంది ఎవరినీ అడగాల్సిన పనిలేదు అంటూ మరొకరు మండిపడ్డారు. ఈ వార్తను క్యారీ చేసిన ప్రధాన పత్రికల వెబ్ సైట్ల కింద కామెంట్లలో అధిక శాతం రాజమౌళిని తీవ్రంగా విమర్శిస్తూ పెట్టిన వారే ఉన్నారు. అయితే ఇక్కడ రాజమౌళి ఆమెను తన వంతుగా ఏమైనా సాయం చేసి ఉంటే ..ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసి ఉంటే బహుశా ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయన ఆయన అలా చేయకుండా నేరుగా తన సినిమా కోసం పనిచేసిందని..కష్టాల్లో ఉందని..ఆమెకు సాయం చేయండి అని కోరటంతో అందరూ రాజమౌళిపై ఎటాక్ ప్రారంభించారు.