Telugu Gateway
Cinema

మహేష్ బాబు సినిమా ఫాస్ట్ గా పూర్తి చేస్తా

మహేష్ బాబు సినిమా ఫాస్ట్ గా పూర్తి చేస్తా
X

సంచలన దర్శకుడు రాజమౌళి తన కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అన్నిటి కంటే ముఖ్యమైనది తన కొత్త సినిమా ను వేగంగా పూర్తి చేస్తాను అన్నారు. రాజమౌళి ఏ కొత్త సినిమా మొదలు పెట్టిన సంవత్సరాలకు సంవత్సరాలు పడుతుంది అనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరో గా తెరకెక్కనున్న సినిమా కథ అంతా సిద్ధం అయింది అని...ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు హీరో మహేష్ బాబు ఒక్కరే సిద్ధం అయ్యారు అని..మిగిలిన నటీ నటుల ఎంపిక జరగాల్సి ఉందన్నారు. జపాన్ లో మీడియా తో మాట్లాడుతూ అయన ఈ విషయాలు వెల్లడించారు.

దీనికి సంబధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. సినిమాను వేగంగా పూర్తి చేసి విడుదల సమయంలో మహేష్ బాబు ను కూడా జపాన్ తీసుకువస్తాను అని రాజమౌళి వెల్లడించారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే జోష్ తో ఇప్పుడు మహేష్ బాబు భారీ బడ్జెట్ తో కొత్త సినిమా ను తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి ప్లాన్స్ చూస్తుంటే దీన్ని అంతర్జాతీయంగా కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది మహేష్ బాబు 29 వ సినిమా .

Next Story
Share it