Telugu Gateway
Cinema

అక్టోబర్ కు షూటింగ్ కంప్లీట్ !

అక్టోబర్ కు షూటింగ్ కంప్లీట్ !
X

రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ ఈ అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నారు. వారణాసి చిత్ర యూనిట్ శనివారం నాడు ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా న్యూ లుక్స్ ను షేర్ చేసింది. ప్రియాంక చోప్రా పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్స్ షేర్ చేసి దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబులు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. వారణాసి మూవీ లో ప్రియాంక మందాకినీ పాత్రలో నటిస్తున్నారు. సెట్ లో ఆమె ఫోటో లు షేర్ చేస్తూ ఆమె నవ్వితే అందం...నవ్వకపోతే నిప్పు కణిక అంటూ రాజమౌళి కాప్షన్ పెట్టారు.

మహేష్ బాబు మాత్రం మా ఒకే ఒక్క మందాకిని హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు. గత 14 నెలలుగా ప్రియాంక చోప్రా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడిగా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన వారణాసి టూ ది వరల్డ్ అనే వీడియో లో చూపించారు. తాజాగా విడుదల చేసిన ప్రియాంక చోప్రా లుక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుంటే...కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అధికారికం కాకపోయినా ఈ మూవీని దగ్గర దగ్గర 1300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు చెపుతున్నారు.

Next Story
Share it