Telugu Gateway
Cinema

కార్తికేయ 'రాజావిక్ర‌మార్క‌' టీజ‌ర్ విడుద‌ల‌

కార్తికేయ రాజావిక్ర‌మార్క‌ టీజ‌ర్ విడుద‌ల‌
X

చిరంజీవి హీరోగా రాజావిక్ర‌మార్క సినిమా వ‌చ్చింది ఒక‌ప్పుడు. ఇప్పుడు అదే టైటిల్ తో కార్తికేయ హీరోగా కొత్త సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో కార్తికేయ‌కు జోడీగా త‌న్య ర‌విచంద్ర‌న్ న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ శ‌నివారం నాడు విడుద‌ల చేసింది.

చిన్నప్పుడు క్రిష్ణ‌గారిని, పెద్ద‌య్యాక టామ్ క్రూజ్ ను చూసి ఆవేశ‌ప‌డి ఉద్యోగంలో చేరా. కానీ దూలతీరిపోతుంది అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ సినిమాకు శ్రీ సారిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప‌లు యాక్షన్ స‌న్నివేశాల‌తో ఆస‌క్తిక‌రంగా టీజ‌ర్ క‌ట్ చేశారు.

Next Story
Share it