Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 కు రెడీ అవుతున్న రాజమౌళి!

ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 కు రెడీ అవుతున్న రాజమౌళి!
X

మరో సారి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ట్రెండింగ్ లో నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం తో సోషల్ మీడియా వేదికగా అత్యధిక సార్లు ప్రస్తావించిన పేరు హీరో ఎన్టీఆర్ ది అయితే...రెండవ ప్లేస్ లో రాంచరణ్ ఉన్నట్లు నెట్ బేస్ క్విడ్ వెల్లడించింది. అదే సమయంలో మరో సారి ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 అంశం తెరపైకి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాదించించగా...అమెరికా తో పాటు జపాన్ లోనూ ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆస్కార్ సందర్భంగా అమెరికాలో ఈ సినిమా ప్రత్యేక షో లు కూడా వేశారు. తాజా గా దర్సకుడు రాజమౌళి ని ఒక జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. అందులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆస్కార్ అవార్డు పార్ట్ 2 ను పనులను మరింత వేగవంతం చేసుందుకు దోహద పడుతుంది అని వ్యాఖ్యానించారు.

దీంతో టైం చెప్పటం కష్టం కానీ ...ఈ సినిమా రెండవ భాగం రావటం ఖాయంగా కనిపిస్తోంది. సహజంగా ప్రతి సినిమాకు రాజమౌళి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి వెంటనే మహేష్ బాబు తో కలిసి కొత్త సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇది పూర్తి అయిన తర్వాత కానీ ఇది అంటే ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 పట్టాలు ఎక్కే అవకాశం లేదు. ఈ లోగా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథకు తుది రూపు ఇచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన ఒక లైన్ మాత్రం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

Next Story
Share it