Telugu Gateway
Cinema

మార్చి 11న 'రాధేశ్యామ్' విడుద‌ల‌

మార్చి 11న రాధేశ్యామ్ విడుద‌ల‌
X

మ‌రో భారీ బ‌డ్జెట్ మూవీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. గ‌త కొన్ని రోజులుగా టాలీవుడ్ లో వ‌ర‌స పెట్టి పెద్ద సినిమాల విడుద‌ల తేదీల‌ను వెల్ల‌డిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్, పూజాహెగ్డెలు జంట‌గా న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ మార్చి11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ విష‌యాన్ని హీరో ప్ర‌భాస్ త‌న ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్ల‌డించారు. ప్రేమ‌, విధి మ‌ధ్య జ‌రిగే అతి పెద్ద యుద్ధానికి స‌న్న‌ద్ధం కండి అంటూ పేర్కొన్నారు.

ఈ సినిమా కూడా క‌రోనా కార‌ణంగా ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇప్పుడు కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో భారీ సినిమాలు అన్నీ క్యూక‌డుతున్నాయి. రాధాక్రిష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్ నిర్మించింది.ప్ర‌భాస్ అభిమానులు ఆయ‌న కొత్త సినిమా కోసం ఎంతో కాలంగా వేచిచూస్తున్నారు.

Next Story
Share it