Telugu Gateway
Cinema

సంక్రాంతికి ప్ర‌భాస్ 'రాధేశ్యామ్'

సంక్రాంతికి ప్ర‌భాస్ రాధేశ్యామ్
X

ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్. ఆయ‌న కొత్త సినిమా రాధే శ్యామ్ అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. జ‌న‌వ‌రి 14న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంద‌ని ప్ర‌బాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా లో ప్ర‌భాస్ కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ తో ప్ర‌భాస్ కొత్త లుక్ ను విడుద‌ల చేశారు. అంతా స‌వ్యంగా సాగితే సంక్రాంతి బ‌రిలో భారీ భారీ సినిమాలే విడుద‌ల కానున్నాయి.

Next Story
Share it