Telugu Gateway
Cinema

మ‌న ఆలోచ‌న‌లు కూడా రాసే ఉంటాయి

మ‌న ఆలోచ‌న‌లు కూడా రాసే ఉంటాయి
X

ప్ర‌భాస్, పూజా హెగ్డే జంట‌గా నటించిన సినిమా రాధేశ్యామ్. ప్రేమ‌కు, విధికి మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే అనే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. మార్చి 11న ఈ సినిమా విడుద‌ల కానుండ‌టంతో చిత్ర యూనిట్ రిలీజ్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేసింది. ప‌లుమార్లు వాయిదాల అనంత‌రం ఈ సినిమా ఎట్ట‌కేల‌కు భారీ ఎత్తున ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. పాన్ ఇండియా మూవీగా దీన్ని తెర‌క్కించారు. 'మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి' అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. 'చేయి చూసి ఫ్యూచర్‌ని, వాయిస్‌ విని పాస్ట్‌ని కూడా చెప్పేస్తావా అని ఒకరు ప్రభాస్‌ని అడగ్గా.. 'విని ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా 'అని ప్రభాస్‌ బదులిస్తాడు.

'ఇంకోసారి చెయ్యి చూడు' అని జగపతి బాబు అడగ్గా.. నాకు రెండో సారి చెయ్యి చూడడం అలవాటు లేదు అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది. ట్రైలర్‌ చివర్లో 'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు' అని పూజా హెగ్డే చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్ర‌భాస్ న‌టించారు. ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధే శ్యామ్. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. .

Next Story
Share it