Telugu Gateway
Cinema

'నేను ఆ టైప్' కాదంటున్న ప్రభాస్

నేను ఆ టైప్ కాదంటున్న ప్రభాస్
X

ప్రేమ కథతో ఎన్ని సినిమాలు వచ్చినా ఆడుతూనే ఉంటాయి. కాకపోతే అందులో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. బహుశా ప్రేమ కథలతో వచ్చినన్ని సినిమాలు మరే జానర్ లో వచ్చి ఉండవు. ఏదో ఒక కొత్త పాయింట్ తీసుకుని కథను ఆకట్టుకునేలా చెపితే చాలు..ఆ సినిమా సూపర్ హిట్టే. ప్రేమకు ఉన్న పవర్ అలాంటిది మరి. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే పనిలో ఉన్నాడు. 'రాధే శ్యామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది.

వాలంటైన్స్ డేను పురస్కరించుకుని ప్రభాస్ అభిమానులకు ఈ కానుక అందించారు. 'నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?' అని పూజా హెగ్డె ప్రశ్నిస్తే 'ఛ, వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్‌ కాదు' అన్న డైలాగ్ తో ఇది కట్ చేశారు. ఈ సినిమా జూలై 30న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Next Story
Share it