Telugu Gateway
Cinema

ప్రభాస్ 'రాధే శ్యామ్ అప్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ రాధే శ్యామ్ అప్ డేట్ వచ్చేసింది
X

ఫిబ్రవరి 14 అంటే యూత్ కు పుల్ జోష్. కారణం ఇది ప్రేమికుల దినోత్సవం కావటమే. ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సరిగ్గా ప్రేమికుల దినోత్సవం రోజు అంటే ఫిబ్రవరి 14న ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్ ' సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ దశాబ్దంలో అతి పెద్ద ప్రేమ ప్రకటన కోసం సిద్ధంగా ఉండండి అంటూ కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా కూడా పీరియాడికల్‌ లవ్‌స్టోరీ కావడంతో ప్రేమికుల రోజునే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది.

ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. రాధాకష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అయిదు బాషలలో విడుదల కాబోతుంది. యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుందని సమాచారం. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story
Share it