Telugu Gateway
Cinema

'రాధేశ్యామ్' కొత్త అప్ డేట్

రాధేశ్యామ్ కొత్త అప్ డేట్
X

ప్ర‌భాస్, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన సినిమా 'రాధేశ్యామ్'. ఈ సినిమా కూడా సంక్రాంతి బ‌రిలో నిలిచి జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి వ‌ర‌స పెట్టి పాట‌లు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త పాట టీజ‌ర్ ను సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ఒక‌టే హృదయము..రెండు గుండె చ‌ప్పుళ్ళు అంటూ కొత్త లుక్ ను విడుద‌ల చేసింది. ఈ సినిమాను యూ వీ క్రిష్ణంరాజు ప్ర‌జంట్ చేస్తుంటే..యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. రాధేశ్యామ్ తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం భాష‌ల్లో విడుదల కానుంది.

Next Story
Share it