Telugu Gateway
Cinema

రాధే శ్యామ్ న్యూ లుక్

రాధే శ్యామ్ న్యూ లుక్
X

ప్ర‌భాస్, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. అయితే కృష్ణాష్టమిని పుర‌స్క‌రించుకుని న్యూ లుక్ ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్. బ్ర‌హ్మండ‌మైన ఈ పోస్ట‌ర్ తో కృష్ణాష్టమిని జ‌రుపుకోండి అంటూ అందులో పేర్కొన్నారు.

ఇందులో ప్ర‌భాస్, పూజా హెగ్డేలు లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. పూజా హెగ్డే పియానో ముందు కూర్చుని ఉండ‌గా..ఆమెను ప్ర‌భాస్ త‌న్మ‌య‌త్వంతో చూస్తూ ఉన్న ఈ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా..రాధాక్రిష్ణ డైర‌క్ట‌ర్ గా ఉన్నారు.

Next Story
Share it