Telugu Gateway
Cinema

రాయన్ ఓటిటి డేట్ ఫిక్స్

రాయన్ ఓటిటి డేట్ ఫిక్స్
X

రాయన్ సినిమాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఇది హీరో ధనుష్ 50 వ సినిమా అయితే...ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించటమే ఈ ప్రత్యేకత. ఈ ఏడాది జులై 24 న విడుదల అయిన ఈ సినిమా అటు తమిళంతో పాటు ఇటు తెలుగు లో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది.

ఆగస్ట్ 23 నుంచి ఇది ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికగా వెల్లడించారు. రాయన్ సినిమాలో ఎస్.జె.సూర్య, ప్రకాశ్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

Next Story
Share it