Telugu Gateway
Cinema

క‌ల‌నెర‌వేరింది అంటున్న రాశీఖ‌న్నా

క‌ల‌నెర‌వేరింది అంటున్న రాశీఖ‌న్నా
X

రాశీఖ‌న్నా చిన్న నాటి క‌ల నెర‌వేరింది. అదేంటి అంటారా..చేతి నిండా మంచు గ‌డ్డ‌ల‌ను ప‌ట్టుకుని త‌న‌పైకి విసురుకోవాలి. ఇప్పుడు ఈ భామ అదే ప‌నిచేసింది. గ‌త కొన్ని రోజులుగా మాస్కోలో ప‌ర్య‌టిస్తున్న రాశీ ఖ‌న్నా అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అంతే కాదు..చేతినిండా మంచును ప‌ట్టుకుని పైకి ఎగ‌రేస్తూ సంతోష‌ప‌డుతోంది. అదే స‌మ‌యంలో నెర‌వేరిన చిన్న నాటి క‌ల అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ను షేర్ చేసింది.

ప్ర‌స్తుతం అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్న థ్యాంక్యూ షూటింగ్ మాస్కోలో జ‌రుగుతోంది. ఓ వైపు షూటింగ్ లో పాల్గొంటూనే అక్క‌డి చ‌లి వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదిస్తోంది రాశీఖ‌న్నా. నిత్యం అక్క‌డ తిరుగుతూ ఆ ఫోటోల‌ను ఇన్ స్టాలో అభిమానుల కోసం పంచుకుంటోంది.

Next Story
Share it