Telugu Gateway
Cinema

రాశీ ఖ‌న్నాకు ప‌క్కా దీవెన‌లు

రాశీ ఖ‌న్నాకు ప‌క్కా దీవెన‌లు
X

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌తి రోజూ పండ‌గే సినిమాలో రాశీ ఖ‌న్నా ఏంజెల్ ఆర్ణా పాత్రలో దుమ్మురేపిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో రాశీ పాత్ర ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కుతున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చిత్రంలో రాశీ ఖ‌న్నా సంద‌డి చేయ‌నుంది.

గోపీచంద్ హీరోగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులోనూ రాశీ ఖ‌న్నా పాత్ర ప్రేక్షకుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించేలా ఉంటుంద‌ని స‌మాచారం. ప‌క్కా క‌మ‌ర్షిక‌ల్ షూటింగ్ స్పాట్ లో రాశీ ఖ‌న్నా ఇలా ద‌ర్శ‌కుడు మారుతి నుంచి ఆశీర్వాదం తీసుకుంటోంది. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Next Story
Share it