పొలాచ్చికి గుడ్ బై చెప్పిన రాశీఖన్నా
BY Admin26 Nov 2020 5:03 PM IST
X
Admin26 Nov 2020 5:03 PM IST
తమిళనాడులోని పొలాచ్చి ప్రకృతి అందాలకు హీరోయిన్ రాశీ ఖన్నా పరవశించిపోతున్నారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఆర్య హీరోగా తెరకెక్కుతున్న అరన్ మనాయ్ 3 సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. కరోనా తర్వాత కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంటే..మరో ప్రధాన పాత్రలో ఆండ్రియా జెర్మయా కూడా నటిస్తోంది.
పొలాచ్చి ప్రకృతి అందాలకు పరవశించిపోయిన రాశీఖన్నా అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ అభిమానులకు అప్ డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమాలో అమాయక గ్రామీణ ప్రాంత అమ్మాయిగా నటిస్తోంది. ఈ లుక్స్ చూస్తేనే ఆ విషయం అర్ధం అవుతోంది. అయితే పొలాచ్చిలో షూటింగ్ పూర్తి అవటంతో మళ్ళీ కలుద్దాం అంటూ కొత్త ఫోటోను జోడించింది రాశీ ఖన్నా.
Next Story