Telugu Gateway
Cinema

సస్పెన్స్ పోస్టర్ ల అసలు విషయం చెప్పిన చిత్ర యూనిట్

సస్పెన్స్ పోస్టర్ ల అసలు విషయం చెప్పిన చిత్ర యూనిట్
X

అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న మూవీ రాకా. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర యూనిట్ ఒక నిగూఢమైన పోస్ట్ పెడుతూ ప్రేక్షకులను సస్పెన్స్ లో ఉంచుతూ వచ్చింది. సోమవారం నాడు ఈ పోస్ట్ అసలు విషయం ఏంటో చెప్పేసింది. ఇటీవల చిత్ర యూనిట్ 3 7 నంబర్ల తో కూడిన ఒక పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రకరకాల ఊహాగానాలు సాగాయి. రాకా సినిమా ఫస్ట్ టీజర్ వస్తుంది అని ఒకరు...రిలీజ్ డేట్ చెప్పబోతున్నారు అంటూ ఈ పోస్టర్ పై ఎవరికీ తోచిన ఊహాగానాలు వాళ్ళు చేశారు. వీటి అన్నిటికి తెర దించుతూ చిత్ర యూనిట్ సోమవారం నాడు ఆ పోస్టర్ లోని నంబర్ల అసలు విషయం ఏంటో చెప్పేసింది. రాకా సినిమా ద్వారా ఫస్ట్ టైం 37 మంది నటీనటుల హావభావాలను మోషన్ క్యాప్చర్క్ టెక్నాలజీ ఉపయోగించి రియల్ టైం లో చిత్రీకరించటం ద్వారా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు.

దీనికి గాను రాకా మూవీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ను రాకా దర్శకుడు అట్లీ...హీరో అల్లు అర్జున్ కు అందించారు. చిత్రీకరణ దశలోనే రాకా మూవీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కించుకోవటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సాంకేతికంగా సరికొత్త ప్రమాణాలతో ఇండియన్ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ ప్రయోగంపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్’ విభాగంలో ఈ రికార్డు నమోదు కావడం గమనార్హం. రాకా సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంటే ఇందులో అల్లు అర్జున్ కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తోంది.

Next Story
Share it