Telugu Gateway
Cinema

ఇలా కూడా చెపుతారా!

ఇలా కూడా చెపుతారా!
X

ష్ప సినిమా నుంచి వెరైటీ అప్ డేట్ వచ్చింది. గతంలో ఎవరూ ఇలాంటి అప్డేట్ ఇచ్చిన దాఖలాలు లేవు అనే చెప్పొచ్చు. ఆ వెరైటీ అప్ డేట్ ఏంటి అంటే ఇప్పటికే పుష్ప 2 సినిమా ఫస్ట్ హాఫ్ ను ఫైర్ తో లాక్ చేసి..లోడ్ చేశామంటూ చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇదే విషయం చెపుతూ న్యూ లుక్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఇందులో డిసెంబర్ ఆరు నుంచి పుష్ప 2 రూల్ ప్రారంభం అవుతుంది అని వెల్లడించారు.

పుష్ప 2 సినిమా విడుదల కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన పుష్ప 2 పాటలు యూట్యూబ్ లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డు లు నమోదు చేస్తూ దూసుకెళుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నట్లు చెపుతున్నారు. త్వరలోనే దీన్ని కూడా ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టనున్నారు.

Next Story
Share it