Telugu Gateway
Cinema

పుష్ప విలన్ వచ్చేశాడు

పుష్ప విలన్ వచ్చేశాడు
X

పుష్ప సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఆదివారం నాడు కీలక అప్ డేట్ ఇఛ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన నటిస్తున్న సినిమాలో విలన్ గా ప్రముఖ మళయాళ నటుడు ఫహద్ పాజిల్ నటించనున్నారు. ఏ సినిమా అయినా విజయవంతం కావాలంటే హీరో పాత్రకు ధీటుగా ప్రతినాయక పాత్ర కూడా ఉండాల్సిందే. అప్పుడే ఆట రంజుగా ఉంటుంది. ఈ మళయాళ నటుడు తెలుగులో తొలిసారిగా విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అల్లు అర్జున్ కు మళయాళంలోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

అన్ని కోణాలను పరిశీలించి పహద్ ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్లు కన్పిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా పుష్పరాజ్ గా కన్పించనున్నారు. ఇప్పటికే విడుదలైన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్ ఈ సినిమా నిర్మిస్తోంది.

Next Story
Share it