Telugu Gateway
Cinema

'పుష్ప' ట్రైల‌ర్ శాంపిల్ వ‌చ్చింది

పుష్ప ట్రైల‌ర్  శాంపిల్ వ‌చ్చింది
X

అల్లు అర్జున్ హంగామా మొద‌లైంది. ముందు శాంపిల్ వ‌దిలారు. పుష్ప చిత్ర యూనిట్ శుక్ర‌వారం సాయంత్రం పుష్ప ట్రైల‌ర్ శాంపిల్ చూపించింది. దాదాపు ఓ అర‌నిమిషం ఉన్న ఈ శాంపిల్ లో ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతుందో చూపించారు. పూర్తి ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 6న విడుద‌ల కానుంది. పుష్ప ద రైజ్ తొలి భాగం విడుద‌ల‌కు ముహుర్తం ద‌గ్గ‌ర‌కు రావ‌టంతో అభిమానుల్లో జోష్ నింపే ప‌నిలో ఉంది పుష్ప టీమ్. ఈ సినిమా కూడా అల్లు అర్జున్, సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ కావటం విశేషం.

తాజాగా వ‌చ్చిన బాల‌క్రిష్ణ‌, బోయ‌పాటి శ్రీనుల‌ హ్యాట్రిక్ మూవీ అఖండ మంచి టాక్ తో దూసుకెళుతున్న విష‌యం తెలిసిందే. పుష్పలో అల్లు అర్జున్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టించింది. సునీల్ కూడా విల‌న్ గా చాలా ర‌ఫ్ లుక్ లో క‌న్పించ‌నున్నాడు. అస‌లు విల‌న్ మాత్రం మ‌ళ‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాసిల్. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it