Telugu Gateway
Cinema

'పుష్ప' ట్రైల‌ర్ డేట్ ఫిక్స్

పుష్ప  ట్రైల‌ర్ డేట్ ఫిక్స్
X

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్క‌డ చూసినా 'పుష్ప' టాకే న‌డుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ క‌న్పించే లుక్ అలా ఉంది. ఒక్క అల్లు అర్జునే కాదు..ఇందులో ప్ర‌తి క్యారెక్ట‌ర్ ను ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన‌ట్లు క‌న్పిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేష‌న్ సినిమా కావ‌టం కూడా దీనిపై క్రేజ్ పెర‌గ‌టానికి కార‌ణం అయింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా లుక్స్ , పాట‌లు అంచ‌నాల‌ను ఓ రేంజ్ కు తీసుకెళ్ళాయి. ఈ సినిమాకు సంబంధించి అత్యంత కీల‌క‌మైన ట్రైల‌ర్ తేదీని ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్.

డిసెంబ‌ర్ 6న ట్రైల‌ర్ ను విడుదల చేయ‌నున్నారు. ఈ మేర‌కు ట్రైల‌ర్ విడుద‌ల తేదీతో కొత్త లుక్ ను విడుద‌ల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

Next Story
Share it