Telugu Gateway
Cinema

అద‌రగొట్టిన 'పుష్ప‌' మేక పాట‌

అద‌రగొట్టిన పుష్ప‌ మేక పాట‌
X

అస‌లు ఆ పాట ఏంది?. ఆ మ్యూజిక్ ఏంది? అల్లు అర్జున్ అద‌ర‌గొట్టాడు. అడ‌విలో సీన్లు...అల్లు అర్జున్ డ్యాన్స్ లు పాట‌లో హైలెట్ గా నిలిచాయి. దాక్కో దాక్కో మేక పాట కొత్త రికార్డులు నెల‌కొల్ప‌టం ఖాయంగా క‌న్పిస్తోంది. అంతే కాదు..ఇది ఊర మాస్ స్టైల్ లో ఉంది. అల్లు అర్జున్ స్టెప్పులు...అడ‌వి సీన్లు హైలెట్ గా నిలిచాయి. అల్లు అర్జున్ ఈ మ‌ధ్య చాలా వ‌ర‌కూ స్టైలిష్ పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు ఊర‌మాస్ పాత్ర‌లో సంద‌డి చేయ‌టానికి వ‌చ్చేస్తున్నాడు. అదే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ చూసిన వారు కూడా అవాక్క‌య్యారు. హెయిర్ స్టైల్ దగ్గ‌ర నుంచి గ‌డ్డం వ‌ర‌కూ అంతా డిఫ‌రెంట్ గా ఉన్నాడు. సుకుమార్..అల్లు అర్జున్ ల‌ది మంచి హిట్ కాంబినేష‌న్.

దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అందులో ఈ సినిమాలో ప్ర‌స్తుత టాలీవుడ్ గోల్డెన్ లెగ్ ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తొలి పాట‌ను శుక్ర‌వారం నాడు విడుద‌ల చేశారు. రెండు భాగాలుగా విడుద‌ల కానున్న పుష్ప సినిమా తొలి భాగం ఈ ఏడాది డిసెంబ‌ర్ 25 క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల కానుంది. తొలి సారి ఓ తెలుగు సినిమాలో ప్ర‌ముఖ మ‌ళ‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాసిల్ విల‌న్ గా క‌న్పించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Next Story
Share it