Telugu Gateway
Cinema

'పుష్ప' విల‌న్ వ‌చ్చాడు

పుష్ప  విల‌న్ వ‌చ్చాడు
X

'పుష్ప' నుంచి వ‌చ్చిన దాక్కో దాక్కో మేక‌.. పాట ఎన్నో సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. ఈ పాట‌లో హీరో అల్లు అర్జున్ స్టెప్పులు డిఫ‌రెంట్ గా ఉన్నాయి. అదే స‌మ‌యంలో లుక్ కూడా అదే స్థాయిలో ఊర మాస్ లో క‌న్పించాడు. ఇప్పుడు సినిమాలో కీల‌క‌మైన విల‌న్ లుక్ ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. 'పుష్ప' మూవీ సుకుమార్, బ‌న్నీ కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ సినిమా అన్న విష‌యం తెలిసిందే. పాన్‌ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శనివారం ఈ మూవీ నుంచి మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ లుక్‌ విడుదల అయింది. 'విలన్‌ఆఫ్‌పుష్ప' పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగాచ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

Next Story
Share it