Telugu Gateway
Cinema

'పుష్ప‌' డ‌బ్బింగ్ ప‌నుల్లో అల్లు అర్జున్

పుష్ప‌ డ‌బ్బింగ్ ప‌నుల్లో అల్లు అర్జున్
X

పుష్ప ద రైజ్ తొలి భాగం విడుద‌ల‌కు శ‌ర‌వేగంగా సిద్ధం అవుతోంది. హీరో అల్లు అర్జున్ త‌న డ‌బ్బింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ వీడియోను విడుద‌ల చేసింది. పుష్ప సినిమా త‌న లాంగ్వేజ్ తోనూ..బాడీ లాంగ్వేజ్ తోనూ అభిమానుల‌ను అల‌రిస్తాడ‌ని పేర్కొన్నారు. ఈ సినిమా తొలి భాగం డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న‌లు తొలిసారి జంట‌గా న‌టిస్తున్నారు. అందులో ఈ సినిమా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌టంతో దీనిపై అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్న విష‌యం తెలిసిందే. ఎందుకంటే వీరిద్ద‌రి హిట్ కాంబినేష‌న్ అలాంటిది మ‌రి. ఇప్ప‌టికే విడుద‌లైన పుష్ప సాంగ్స్ అన్నీ కూడా అదిరిపోయాయ‌నే చెప్పాలి. ప్ర‌తి క్యారెక్ట‌ర్ లుక్ ఇందులో డిఫ‌రెంట్ గా ఉంది.

Next Story
Share it