Telugu Gateway
Cinema

'పుష్ప సామి వ‌చ్చాడు'

పుష్ప సామి వ‌చ్చాడు
X

'నువ్వు అమ్మీ అమ్మీ అంటుంటే నీ పెళ్ళాం అయిపోయిన‌ట్లు ఉందిరా సామీ.నా సామీ.' అంటూ సాగే పుష్ప సినిమాలోని మూడ‌వ లిరిక‌ల్ సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు విడుద‌ల చేసింది. ఈ సామి పూర్తి సాంగ్ అక్టోబ‌ర్ 28న విడుద‌ల చేయ‌నున్నారు. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో ఇప్ప‌టికే విడుద‌ల రెండు పాట‌లు సినిమాపై అంచ‌నాలను మ‌రింత పెంచాయి. ఈ మూడ‌వ పాట కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది. పుష్ప తొలి భాగం డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it