Telugu Gateway
Cinema

పుష్ప ఐటెం సాంగ్ వ‌చ్చేసింది

పుష్ప ఐటెం సాంగ్ వ‌చ్చేసింది
X

పుష్ప సినిమా నుంచి చివ‌రి పాట కూడా వ‌చ్చింది. ఈ పాట‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది.ఈ ఐటెం సాంగ్ లో స‌మంత హంగామా చేసిన విష‌యం తెలిసిందే. చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం ఈ లిరిక‌ల్ సాంగ్ ను విడుద‌ల చేసింది. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ పుష్పలో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ హంగామా చేసింది.

'మీ మగబుద్ధే వంకరబుద్ధి..' అంటూ సాగింది ఈ పాట‌. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. అయితే సినిమాలోని ఇత‌ర పాట‌ల‌తో పోలిస్తే స‌మంత ప్ర‌త్యేక గీతం కిక్ ఇచ్చేలా లేదనే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Next Story
Share it