Telugu Gateway
Cinema

ఆకాశం ముక్కా నాదే అంటున్న అల్లు అర్జున్

ఆకాశం ముక్కా నాదే అంటున్న అల్లు అర్జున్
X

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వీర మాస్ క్యారెక్ట‌ర్ పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొత్త పాట‌ను చిత్ర యూనిట్ శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసింది. పాన్‌ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న 'పుష్ప' . ఈ సినిమా తొలి పార్ట్‌ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దక్కో మేక', 'చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే' 'సామీ సామీ' పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి.

కొత్త‌గా ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే..తలపైన ఆకాశం ముక్కా నాదే..'ఏ బిడ్డ ఇది నా అడ్డ‌'అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టుతో ఊర మాస్‌ లుక్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సమంత ఈ చిత్రంలో స్పెషల్‌సాంగ్‌లో కనిపింనుండటం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. స‌మంత ఓ పాట‌లో సంద‌డి చేయనున్నట్లు ఇటీవ‌లే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it