అల్లు అర్జున్ 'పుష్స రికార్డు'
BY Admin27 April 2021 1:19 PM
X
Admin27 April 2021 1:19 PM
టాలీవుడ్ లో అల్లు అర్జున్ మరో రికార్డు సృష్టించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాకు సంబంధించి ఇటీవలే అల్లు అర్జున్ పాత్రను పరిచయం చేస్తూ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది అత్యంత వేగంగా 50 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకున్న వీడియోగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ వెల్లడించింది. ఇది అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డు అని పేర్కొన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది.
Next Story