Telugu Gateway
Cinema

అదరగొట్టిన అల్లు అర్జున్

అదరగొట్టిన అల్లు అర్జున్
X

దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సినిమాల్లో పుష్ప 2 ఒకటి. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగల్ పుష్ప పుష్ప పాట బుధవారం నాడు విడుదల అయింది. ఈ పాట విడుదలకు ముందు చిత్ర యూనిట్ హీరో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన పలు లుక్స్ విడుదల చేస్తూ దీనిపై హైప్ పెంచే ప్రయత్నం చేసింది అనే చెప్పాలి. పుష్ప ది రూల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15 న విడుదల కానుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా పై ప్రచార వేగాన్ని పెంచి సినిమాపై హైప్ ను ఒక రేంజ్ కు తీసుకెళుతుంది అనటంలో సందేహం లేదు. పుష్ప 2 లో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా, సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ ఒక్క పాటతో పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. ఈ పాటలో విజువల్స్ తో పాటు అల్లు అర్జున్ స్టెప్స్ కొన్ని ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయనే చెప్పొచ్చు. పుష్ప ది రైజ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపింది. అంతే కాదు..అల్లు అర్జున్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో గా మారిపోయారు. పుష్ప సినిమాలో పాటలతో పాటు డైలాగులతో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు అనే చెప్పాలి.

Next Story
Share it