Telugu Gateway
Cinema

'పుష్ప‌' ఈవెంట్ ర‌గ‌డ‌పై కేసు న‌మోదు

పుష్ప‌ ఈవెంట్  ర‌గ‌డ‌పై కేసు న‌మోదు
X

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న సినిమా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైద‌రాబాద్ లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ర‌చ్చ‌రచ్చ చేశారు. బారికేడ్లు, పోలీసుల‌ను తోసుకుని మ‌రీ లోప‌లికి వెళ్లారు. ఫ్యాన్స్ ను నియంత్రించ‌టం పోలీసుల‌కు, ఈవెంట్ మేనేజ‌ర్ల‌కు చాలా క‌ష్టంగా మారింది. ఓ ద‌శ‌లో ఇలాగే గొడవ చేసే కార్య‌క్రమాన్ని నిలిపివేయాల్సి వ‌స్తుంద‌ని నిర్వాహ‌కులు ప‌దే ప‌దే ప్ర‌క‌టించారు. మొత్తం మీద కార్య‌క్ర‌మం అయితే పూర్త‌యింది. అయితే సోమ‌వారం నాడు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు పోలీసులు న‌మోదు చేశారు.

నిర్వాహ‌కులు కేవలం 5000 పాస్‌లకు మాత్రమే అనుమతి తీసుకుని ఎక్కువ పాసులు జారీ చేశారని నిర్ధారించిన పోలీసులు శ్రేయాస్ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్‌పై కేసు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ ర‌ష్మిక‌తోపాటు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, కొర‌టాల శివ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Next Story
Share it