Telugu Gateway
Cinema

పుష్ప 3 టైటిల్ ఫిక్స్ అయిందా?

పుష్ప 3  టైటిల్ ఫిక్స్ అయిందా?
X

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప జాతీయ స్థాయిలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15 న విడుదల ముహూర్తం నిర్ణయించుకున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే పుష్ప 3 సినిమాను పుష్ప ది రోర్ పేరుతో తెరకెక్కించనున్నారట. తొలి భాగానికి పుష్ప ది రైజ్ అని పేరు పెట్టగా..సీక్వల్ గా వస్తున్న పుష్ప 2 కు పుష్ప ది రూల్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు పుష్ప ది రోర్ పేరుతో మూడవ పార్ట్ ను కూడా తెరకెక్కించనున్నారు.

కొద్దిరోజుల క్రితం హీరో అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కథను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే ప్రకటించిన సుకుమార్, రామ్ చరణ్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత పుష్ప 3 సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఈ లోగా అల్లు అర్జున్ కూడా తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసుకోనున్నారు. కొద్ది రోజుల క్రితం పుష్ప లో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందాన కూడా రెండవ పార్ట్ అదిరిపోయేలా ఉంటుంది అని చెప్పి సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చేశారు.

Next Story
Share it