Telugu Gateway
Cinema

పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది

పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది
X

అల్లు అర్జున్ అభిమానుల‌కు గుడ్ న్యూస్. సోమ‌వారం నాడు ఓ అప్ డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్ ..మంగ‌ళ‌వారం నాడు మ‌రో వార్త చెప్పింది. అదేంటి అంటే ఫుష్ప సినిమా తొలి భాగం ఈ ఏడాది డిసెంబ‌ర్ లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఐదు భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ‌. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ ను ఆగ‌స్టు 13న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రిలీజ్ డేట్ కు సంబంధించి విడుద‌ల చేసిన లుక్ కూడా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమాలో అల్లు అర్జున్ ఊర‌మాస్ గా క‌న్పించ‌నున్నారు.

Next Story
Share it