Telugu Gateway
Cinema

'పుష్ప‌'లో సునీల్ ను చూశారా?!

పుష్ప‌లో సునీల్ ను చూశారా?!
X

పుష్ప సినిమా అంద‌రినీ మార్చేసింది. హీరో అల్లు అర్జున్ ద‌గ్గ‌ర నుంచి హీరోయిన్ ర‌ష్మిక మంద‌న వ‌ర‌కూ అంద‌రూ డిఫ‌రెంట్ లుక్ లో క‌న్పిస్తున్నారు.. అల్లు అర్జున్ అయితే ఊర‌మాస్ లుక్ లో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. ర‌ష్మిక కూడా శ్రీవ‌ల్లిగా ఆ ప్రాంతానికి త‌గ్గ‌ట్లు మారిపోయింది. ఇప్పుడు సునీల్ వంతు వ‌చ్చింది. ఈ సినిమాలో సునీల్ మంగ‌ళం శ్రీనుగా క‌న్పించ‌నున్నాడు. ఆయ‌న ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుద‌ల చేసింది.

ఈ లుక్ లో సునీల్ భ‌య‌పెట్టేలా ఉన్నాడు. చెవిద‌గ్గ‌ర ఫోన్ పెట్టుకుని సీరియ‌స్ లుక్ లో క‌న్పిస్తాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. మొద‌టి భాగం డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా సంద‌డి చేయనుంది. ఇప్ప‌టికే విడుద‌లైఈ ఈ సినిమా పాట‌ల‌కు కూడా విశేష స్పంద‌న ద‌క్కుతోంది. యూట్యూబ్ లో ఈ పాట‌లు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా..దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it