Telugu Gateway
Cinema

'పుష్ప‌' ప్ర‌త్యేక గీతంలో స‌మంత‌

పుష్ప‌ ప్ర‌త్యేక గీతంలో స‌మంత‌
X

పుష్ప చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పుష్ప ద రైజ్ పేరుతో వ‌స్తున్న తొలి భాగంలో స‌మంత ఓ ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేయ‌నుంది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. అల్లు అర్జున్ తో క‌ల‌సి స‌మంత ఓ పాటలో ప‌నిచేయ‌టానికి స‌మంత అంగీక‌రించార‌ని..ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌టానికి తాము ఎంతో సంతోషిస్తున్న‌ట్లు తెలిపారు. అల్లు అర్జున్, స‌మంత‌లు గ‌తంలో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో క‌ల‌సి న‌టించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే విడుద‌లైన పుష్ప లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్ మొద‌లుకుని ర‌ష్మిక‌, సునీల్, అన‌సూయ‌ల లుక్స్ చాలా ప్ర‌త్యేక‌త చాటుకున్నాయి. ఈ సినిమా పాట‌లు కూడా ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.

న‌వంబ‌ర్ 19న నాల్గ‌వ సింగిల్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇవాళ సమంత విష‌యం వెల్ల‌డించారు. ఇది పుష్ప తొలి భాగంలో ఐద‌వ పాట కానుంది. ఈ సినిమా తొలి భాగం డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ కావటంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తొలుత ఈ పాట‌కు బాలీవుడ్ న‌టి నోరాప‌తేహి పేరు ప‌రిశీల‌న‌లో ఉన్నా..ఆమె డేట్స్ కుద‌ర‌క‌పోవ‌టంతో స‌మంత వైపు మొగ్గుచూప‌టం..ఆమె దీనికి ఓకే చేయ‌టం చ‌క‌చ‌కా సాగిపోయిట్లు స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it