Telugu Gateway
Cinema

పుష్ప లో 'శ్రీవ‌ల్లి'గా ర‌ష్మిక‌

పుష్ప లో శ్రీవ‌ల్లిగా  ర‌ష్మిక‌
X

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమాలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ర‌ష్మిక‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది. ర‌ష్మిక మ‌ల్లెపూలు ముందుపెట్టుకుని సింగారించుకుంటున్న ఫోటోను విడుద‌ల చేశారు. రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ క్రిస్మ‌స్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఇది అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ సినిమా. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ గా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో క‌న్పించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన దాక్కో దాక్కో మేక‌..పులొచ్చి కొరుకుద్ది పీక అనే పాట దుమ్మురేపుతున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమా ప‌లు భాష‌ల్లో విడుద‌ల కానుంది.

Next Story
Share it