Telugu Gateway
Cinema

'పుష్ప‌'లో అన‌సూయ లుక్ ఇదే

పుష్ప‌లో అన‌సూయ లుక్ ఇదే
X

ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ ఓ వైపు టీవీ షోల‌తో ఫుల్ బిజీగా ఉంటూనే ప్ర‌త్యేక పాత్ర‌ల‌తో సినిమాల్లోనూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. సూప‌ర్ హిట్ సినిమా రంగ‌స్థలంలో రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ తో ఆక‌ట్టుకుంది. మ‌ళ్లీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే ప్ర‌త్యేక పాత్ర‌ను ద‌క్కించుకుంది. పుష్ప‌లోనూ ఆమెకు ఓ పాత్ర ద‌క్కింది. అదే దాక్షాయణి పాత్ర‌. పుష్పలో ఆమె పాత్ర‌కు సంబంధించి లుక్ ను చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది.

ఈ లుక్ చూస్తుంటే పుష్ప‌లోనూ అన‌సూయ‌కు అదిరిపోయే క్యారెక్ట‌ర్ దొరికిన‌ట్లే క‌న్పిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ క‌థాంశంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న సైతం డిఫ‌రెంట్ లుక్స్ తో ఆక‌ట్టుకున్నారు. సునీల్, అన‌సూయ లుక్స్ కూడా వీర నాటుగా ఉన్నాయి. ఈ సినిమాలో పూర్తి అహంకారంతో కూడిన పాత్ర‌లో అన‌సూయ క‌న్పించ‌నుంది. పుష్ప తొలి భాగం డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it