Telugu Gateway
Cinema

పుష్ప సెకండ్ సింగిల్ వ‌చ్చేసింది

పుష్ప సెకండ్ సింగిల్ వ‌చ్చేసింది
X

పుష్ప సినిమా నుంచి మ‌రో పాట వ‌చ్చేసింది. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న‌ల‌పై చిత్రీక‌రించిన నీ చూపే బంగార‌మాయే సాంగ్ లో పాట కంటే అల్లు అర్జున్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. మామూలుగా అల్లు అర్జున్ డ్యాన్స్ అంటేనే అదిరిపోతుంది. అలాంటిది ఈ పాట‌లో వెరైటీ స్టెప్పుల‌తో అల్లు అర్జున్ న‌వ్వులు పూయిస్తున్నాడు. పూర్తిగా గ్రామీణ వాతావ‌ర‌ణంలో సాగే సినిమా కావ‌టంతో దీనికి అనుగుణంగానే ఈ పాట ఉన్న‌ట్లు క‌న్పిస్తోంది.

రెండు భాగాలుగా చిత్రీక‌రించిన ఈ పుష్ప సినిమా తొలి భాగం డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మించింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో ఇది హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ పాడ‌గా..దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. అల‌వైకుంఠ‌పురంలో సినిమా సూప‌ర్ హిట్ త‌ర్వాత వ‌స్తున్న అల్లు అర్జున్ సినిమా ఇదే కావ‌టంతో ఆయ‌న అభిమానులు దీనిపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు.

Next Story
Share it