Telugu Gateway
Cinema

తెలంగాణ‌లో 'పుష్ప' ఐదు షోల‌కు అనుమ‌తి

తెలంగాణ‌లో పుష్ప ఐదు షోల‌కు అనుమ‌తి
X

తెలంగాణ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఏపీ వ‌ద్దు అంటుంటే తెలంగాణ స‌ర్కారు సై అంటోంది. రాష్ట్రంలో పుష్ప సినిమా ఐదు షోల‌కు అనుమ‌తిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వానికి ప‌న్నుల రూపంలో అద‌న‌పు ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ ఏపీ స‌ర్కారు మాత్రం రేట్లు పెంచ‌వ‌ద్దు..అద‌న‌పు షోల‌కు అనుమ‌తి ఇవ్వం అంటూ ప్ర‌క‌టిస్తోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పుష్ప సినిమా శుక్ర‌వారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టించింది. ఇద్ద‌రూ మాస్ లుక్స్ లో ఆక‌ట్టుకున్నారు.

టీజ‌ర్, ట్రైల‌ర్స్ తో ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్ కు వెళ్ళాయి. ఇదే అద‌నుగా తెలంగాణ‌లో టిక్కెట్ల రేట్ల‌ను కూడా భారీగా పెంచేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ అథినేత దిల్‌ రాజు తెలంగాణ ప్రభుత్వానికి చేసిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఐదో షోకి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల 17 తేది నుంచి 30 వరకూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని థియేటర్లలోనూ 'పుష్ప' సినిమా ఐదు షోలు ప్రదర్శించేలా అనుమతి వ‌చ్చింది. ఈ నెలాఖరు నుంచి యధావిదిగా నాలుగు షోలకే అనుమతి ఉన్నట్లు జీవోలో పేర్కొన్నారు.

Next Story
Share it