Telugu Gateway
Cinema

'పుష్ప‌' మూవీపై ఉమైర్‌ సంధు ఏమ‌న్నాడంటే!

పుష్ప‌ మూవీపై ఉమైర్‌ సంధు  ఏమ‌న్నాడంటే!
X

టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోల సినిమాల‌పై ఆయ‌న అంద‌రికంటే ముందే స్పందిస్తాడు. ఆయ‌న చెప్పిన మాటలు కొన్ని సార్లు నిజం అయ్యాయి..కొన్నిసార్లు ఫ‌ట్ మన్నాయి. తాజాగా ఆయ‌న పుష్ప ఫ‌స్ట్ రివ్యూ పేరుతో ట్విట్ట‌ర్ లో స్పందించాడు. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఇత‌ర ప్రాంతాల్లోనూ ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తొలి రోజు సినిమా టిక్కెట్ల కోసం డిమాండ్ పీక్ కు చేరింది. ఈ సినిమా డిసెంబర్‌ 17న ఏడు భాషల్లో రిలీజ్‌ అవుతున్న విష‌యం తెలిసిందే. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్‌ సంధు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. యూఏఈ సెన్సార్‌ బోర్డు సభ్యుడైన ఆయ‌న పుష్ప మూవీ చాలా అద్భుతంగా ఉందన్నారు. 'పుష్ప' ఈ ఏడాదిలోనే ఉత్తమ టాలీవుడ్‌ చిత్రంగా నిలుస్తుందని జోస్యం చెప్పారు.

ఈ సినిమా అల్లు అర్జున్‌ కెరీర్‌ను మలుపు తిప్పుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. బన్నీని సరికొత్త అవతారంలో చూసి ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తార‌ని పేర్కొన్నారు. రష్మిక మంద‌న్నా అద్భుతంగా నటించిందన్న ఉమైర్‌ హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండిందని తెలిపారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, సుకుమార్‌ దర్శకత్వం ఓ రేంజ్‌లో ఉందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరెక్కనున్న పుష్ప సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో ఆకట్టుకోనుంది. స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో ఇది హ్యాట్రిక్ సినిమా కావ‌టం కూడా ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది.

Next Story
Share it