'పుష్ప' సెన్సార్ పూర్తి
BY Admin10 Dec 2021 7:26 AM GMT

X
Admin10 Dec 2021 7:26 AM GMT
అల్లు అర్జున్, రష్మిక మందనలు జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ గురువారం నాడు వెల్లడించింది. సెన్సార్ ఈ సినిమాకు యూ-ఏ సర్టిఫికెట్ అందజేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా ఇప్పటికే విడుదలై పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
సినిమాలో పాటలు అన్నీ కూడా దుమ్మురేపాయి. అంతే కాకుండా అల్లు అర్జున్ వీరమాస్ లెవల్ నటన చూసి ఆయన అబిమానులు అయితే సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Next Story