Telugu Gateway
Cinema

పుష్ప కొత్త అప్ డేట్ ఇదే

పుష్ప కొత్త అప్ డేట్ ఇదే
X

పుష్ప సినిమా నుంచి మ‌రో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన నాల్గ‌వ పాట న‌వంబ‌ర్ 19న విడుదల కానుంది. చిత్ర యూనిట్ ఈ విష‌యాన్ని ఆదివారం ఉద‌యం న్యూలుక్ విడుద‌ల చేయ‌టం ద్వారా వెల్ల‌డించింది. ' ఏ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ఈ పాట సాగ‌నుంది. ఈ లుక్ లోనూ అల్లు అర్జున్ అదిరిపోయే స్టైల్ లో క‌న్పిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పుష్ప పాట‌లు అన్నీ విశేష ఆద‌ర‌ణ పొందుతున్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న‌లు న‌టించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it