Telugu Gateway
Cinema

'దుమ్మురేపుతున్న‌' పుష్ప క‌లెక్షన్లు

దుమ్మురేపుతున్న‌ పుష్ప క‌లెక్షన్లు
X

అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప నూత‌న రికార్డు నెల‌కొల్పింది. 2021 సంవ‌త్స‌రంలో అతిపెద్ద గ్రాస్ వ‌సూళ్ళు చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ సినిమా డిసెంబ‌ర్ 17న విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ 71 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు చేసిన‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ అధికారికంగా వెల్ల‌డించింది. బాక్సీఫీస్ పై ఇది పుష్ప దండ‌యాత్ర అని పేర్కొన్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పుష్ప ద రైజ్ సినిమాల అల్లు అర్జున్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టించింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. పుష్ప‌లో క‌థ కంటే అల్లు అర్జున్ న‌ట‌నే కీల‌కంగా మారింది. ఊర‌మాస్ లుక్ లో అద‌ర‌గొట్టే ప‌ర్మార్సెన్స్ చూపించి ఈ సినిమాతో త‌న‌దైన ముద్ర‌వేశాడు అల్ల అర్జున్. ఒవ‌రాల్ గా చూస్తే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ‌స్టాఫ్ సాఫీగా...స్పీడ్ గా సాగిపోయింది. సెకండాఫ్ లో మాత్రం కాస్ల స్లో అయిన‌ట్లు అన్పిస్తుంది. పాట‌లు కూడా సినిమాకు ప్ల‌స్ అయ్యాయి.

Next Story
Share it