Telugu Gateway
Cinema

'పుష్ప‌' రెండు రోజుల వ‌సూళ్ళు 116 కోట్లు

పుష్ప‌ రెండు రోజుల వ‌సూళ్ళు 116 కోట్లు
X

భార‌తీయ సినిమా చరిత్ర‌లో అతిపెద్ద గ్రాస్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా పుష్ప నిలిచింద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా 116 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు చేసింద‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ తెలిపింది. బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప హ‌వా కొనసాగుతోంది. ఆదివారం నాడు కూడా థియేట‌ర్ల వ‌ద్ద హౌస్ ఫుల్ బోర్డులు క‌న్పిస్తున్నాయి.

దీంతో మూడ‌వ రోజు కూడా మంచి వ‌సూళ్ళు సాధించి మరిన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయంగా క‌న్పిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మగ్ల‌ర్ గా అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా ర‌ష్మిక మంద‌న న‌టించింది.

Next Story
Share it