Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

అల్లు అర్జున్ ఫాన్స్ కు గుడ్ న్యూస్
X

అల్లు అర్జున్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. మాస్ జాతరకు సిద్ధంగా ఉండాలంటూ అప్ డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..మంగళవారం నాడు పుష్ప 2 టీజర్ తేదీ ని వెల్లడించింది. ఏప్రిల్ 8 న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించటంతో పుష్ప 2 పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా ను ఆగస్ట్ 15 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పోలీస్ ఆఫీస్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తొలి భాగం పుష్ప రైజ్ అయితే...ఇప్పుడు రెండవ భాగం పుష్ప ది రూల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో కీలక విషయం ఏమిటి అంటే మూడవ భాగానికి పుష్ప ది రోర్ అని పేరు పెట్టినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

పుష్ప 2 సినిమా కు సంబంధించి ఇప్పటికే బయటకు వచ్చిన లుక్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలం లో టాప్ హీరో లు అన్ని రెండు భాగాలుగా రావటం...మంచి హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ను రెండు భాగాలుగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఇప్పుడు సలార్ కూడా ఇదే బాటలో పయనించనుంది. మరో వైపు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కూడా రెండు పార్ట్ లుగా రానుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన డీ జె టిల్లు, తాజాగా విడుదల అయిన టిల్లు స్క్వేర్ కూడా దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో పుష్ప 2 కూడా హిట్ పక్కా అన్న ధీమా తో అల్లు అర్జున్ ఫాన్స్ ఉన్నారు.

Next Story
Share it