Telugu Gateway
Cinema

పుష్ప 2 టీజర్ వచ్చేసింది

పుష్ప 2 టీజర్ వచ్చేసింది
X

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 పై ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. దీనికి ప్రధాన కారణం పుష్ప ది రూల్ సినిమా లో అల్లు అర్జున్ మాస్ యాక్షన్ తో పాటు పాటలు..హీరోయిన్ రష్మిక ..ఇలా కారణాలు ఎన్నో. ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరెకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా కూడా వసూళ్ల విషయంలో దుమ్ము రేపింది. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా హీరో గా చేసిన సినిమా కూడా ఇదే అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆగస్ట్ 15 న విడుదల కానున్న పుష్ప ది రూల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ ముందు ప్రకటించినట్లు గానే సోమవారం నాడు టీజర్ విడుదల చేసింది. అయితే ఈ టీజర్ మాత్రం అంచనాలు అందుకోలేక పోయింది అనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఇందులో ఒక్కటంటే ఒక్క డైలాగు కూడా లేకపోవటం ఒకటి.

మరో కీలక అంశం ఇప్పటికే టీజర్ లో కనిపించిన లుక్ చాలా రోజుల క్రితమే బయటకు వచ్చింది. టీజర్ లో ఒక జాతరలో చీరకట్టుకుని కనిపించిన అల్లు అర్జున్ కాలితో కొంగు పట్టుకునే సీన్ తప్ప ఏదీ కూడా వావ్ అనిపించే మూమెంట్ లేకపోవటం ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫాన్స్ ను నిరాశపర్చే అంశమే. అయితే ఒక్క టీజర్ ఆధారంగా సినిమాపై అంచనాకు రావటం అన్నది సరి కాదు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయటానికి టీజర్, ట్రైలర్ లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరో రాబోయే రోజుల్లో వచ్చే పుష్ప 2 నుంచి వచ్చే అప్ డేట్స్ సినిమా పై ఎంత హైప్ క్రియేట్ చేస్తాయో వేచిచూడాల్సిందే. పుష్ప 2 సినిమా తెలుగు, హిందీ తో పాటు మొత్తం ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it