Telugu Gateway
Cinema

వచ్చే ఏడాది పుష్పరాజ్ వస్తున్నాడు

వచ్చే ఏడాది  పుష్పరాజ్ వస్తున్నాడు
X

అల్లు అర్జున్ ఫాన్స్ కు బిగ్ అప్ డేట్ . పుష్ప 2 విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పరాజ్ మళ్ళీ వస్తున్నాడు అంటూ మైత్రి మూవీ మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించి, తేదీని మార్క్ చేసి పెట్టుకోండి అంటూ కోరింది. అల్లు అర్జున్ చేతికి రక్తపు మరకలు..రకరకాల ఉంగరాలు ఉన్న లుక్ తో ఈ వివరాలు షేర్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కున్తున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలన విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప రెండవ భాగం పై ఉన్నాయనే చెప్పొచ్చు. ఈ సినిమా లో అదిరిపోయే సీక్వెన్సులు ఉన్నాయంటూ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చెప్పిన రెండు రోజులకే ఈ సినిమా విడుదల అప్ డేట్ రావటం విశేషం. ఈ సినిమా విడుదల తేదీపై రకరకాల తేదీల ప్రచారంలో ఉండగా వాటికీ చెక్ పేరుతో అధికారికంగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ వెల్లడించింది. ఈ తేదీ ప్రకారం చూస్తే సినిమా విడుదలకు ఇంకా పదకొండు నెలలు ఉంది.

Next Story
Share it