Telugu Gateway
Cinema

అందుకే అల్లు అర్జున్ లుక్ మారిందా?

అందుకే అల్లు అర్జున్ లుక్ మారిందా?
X

అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఆగస్ట్ 15 న విడుదల కావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ ఆరుకు వాయిదా వేశారు. ఇప్పుడు మరో సారి ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అనే ప్రచారం తెరమీదకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం తాజాగా అల్లు అర్జున్ లుక్ లో చోటు చేసుకున్న మార్పులే. ఆయన తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకుని...ఫ్యామిలీ తో హాలిడే కోసం విదేశీ పర్యటనకు వెళ్లారని చెపుతున్నారు. మరో వైపు దర్శకుడు సుకుమార్ అమెరికా పర్యటనలో ఉండటంతో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో జాప్యం జరుగుతుంది అని...ఈ సినిమాలో విలన్ గా ఉన్న ఫహద్ ఫాజిల్ ఇచ్చిన డేట్స్ కు చిత్ర యూనిట్ సరిగా ఉపయోగించుకోకపోవటంతో అది కూడా ఇప్పుడు సమస్యగా మారినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ సినిమా విడుదల వాయిదాకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా అధికారిక సమాచారం అయితే లేదు. కానీ వరసగా చోటు చేసుకుంటున్న సంఘటనల ఆధారంగా టాలీవుడ్ లో మాత్రం సినిమా విడుదల వచ్చే ఏడాదే ఉండే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ వచ్చే వరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు సస్పెన్స్ తప్పదు అనే చెప్పాలి. ప్రచారం జరుగుతున్నట్లు నిజంగానే ఈ సినిమా మరో సారి వాయిదా పడితే మాత్రం సినిమాపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతోంది. పుష్ప సినిమా కు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కటంతో పుష్ప 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కిన విషయం తెలిసిందే.

Next Story
Share it